Narayan Dutt Tiwari
-
ఎన్డీ తివారీ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణ్‌దత్ తివారీ(93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గతేడాది బ్రెయిన్‌స్ట్రోక్ రావడంతో తివారీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్లో 1925, అక్టోబర్ 18న నారాయణ్ దత్ తివారీ జన్మించారు. 1947లో వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1976లో తొలిసారిగా ఉత్తరప్రదేశ్ సీఎంగా చేశారు. యూపీకి మూడుసార్లు, ఉత్తరాఖండ్‌కు ఒకసారి సీఎంగా చేశారు. కేంద్రంలో ఇందిరాగాంధీ, రాజవ్ హయాంలో ఆర్థికం, పెట్రోలియం, విదేశాంగ మంత్రిగా చేశారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గానూ వ్యవహరించారు. కాగా తివారీ మృతిపై ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, నేతలు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్ తదితరులు తివారీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. -
తివారీ పెళ్లికొడుకాయెనే..
లక్నో: కాంగ్రెస్ కురు వృద్ధుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి నారాయణ్‌దత్ తివారీ గురువారం తన చిరకాల స్నేహితురాలు ఉజ్వలాశర్మను వివాహం చేసుకున్నారు. బుధవారం రాత్రి మాల్ అవెన్యూలోని తివారీ నివాసంలో ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో తమ పెళ్లి జరిగినట్లు ఉజ్వలాశర్మ (67) తెలిపారు. కొద్ది రోజుల క్రితం తివారీ(88) పెళ్లి ప్రతిపాదన తెచ్చినట్లు చెప్పారు. తమ బంధానికి సామాజిక ఆమోదం లభించినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. అధికారిక ప్రకటన అనంతరం వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు లభించేలా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తివారీ కార్యాలయం పేర్కొంది. రిటైర్డ్ లెక్చరర్ ఉజ్వలాశర్మ ద్వారా తనకు రోహిత్ శేఖర్ అనే కుమారుడు ఉన్నట్లు దీర్ఘకాల న్యాయపోరాటం అనంతరం ఇటీవలే తివారీ అంగీకరించిన విషయం తెలిసిందే. డీఎన్ఏ పరీక్షల అనంతరం రోహిత్‌ను తన కుమారుడిగా తివారీ అంగీకరించారు. తివారీ నివాసంలోకి తనను అనుమతించకపోవటంతో ఉజ్వలాశర్మ కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసుల జోక్యంతో ఈ వివాదం చల్లబడి ఇద్దరూ అదే ఇంట్లో సహజీవనం చేసేందుకు సమ్మతించారు. తివారీ మొదటి భార్య కొద్ది సంవత్సరాల క్రితం మరణించారు. -
ఎన్డీ తివారీని కలిసిన ఉజ్వలా శర్మ
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణ్ దత్ తివారీని శుక్రవారం రాత్రి ఆయన ఒకప్పటి సహచరి ఉజ్వలా శర్మ కలిశారు. తివారీని కలిసేందుకు లక్నోలోని ఆయన నివాసానికి వచ్చిన ఉజ్వలను తొలుత తివారీ భద్రతాధికారి భవానీ భట్ లోపలికి అనుమతించలేదు. దీంతో ఆమె తివారీ ఇంటి ముందు బైటాయించారు. స్వల్ప వాగ్వాదం తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు వచ్చి ఉజ్వలను లోపలికి తీసుకెళ్లి తివారీతో మాట్లాడించారు. ఢిల్లీకి చెందిన మాజీ ప్రొఫెసర్ అయిన ఉజ్వలా శర్మకు తివారీ ద్వారా గతంలో రోహిత్ శేఖర్ అనే ఓ కుమారుడు జన్మించగా.. కోర్టులో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాతే ఆయన ఇటీవల రోహిత్‌ను జన్యుపరమైన కుమారుడిగా అంగీకరించిన విషయం తెలిసిందే. -
యాంకర్‌తో పాటు స్టెప్పులేసిన తివారీ