‘నర్రా’ స్ఫూర్తిగా హక్కుల సాధనకు పోరు
- రాఘవరెడ్డి సంతాప సభలో సున్నం రాజయ్య
హైదరాబాద్: ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు నర్రా రాఘవ రెడ్డి స్ఫూర్తిగా హక్కుల సాధనకోసం పోరాటం చేయాలని సీపీఎం శాసన సభాపక్ష నేత సున్నం రాజయ్య అన్నారు. బుధవారమిక్కడ తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో రాఘవ రెడ్డి సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ తొలిసారిగా గ్రామ సేవకుల సంఘాన్ని ఏర్పాటు చేసింది రాఘవ రెడ్డి అని, వారి వేతనాల పెంపుకోసం ఆయన కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర నాయకుడు వంగూరి రాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు, రాష్ట్ర నేతలు పాలడుగు భాస్కర్, ఎస్.రమా, రైతు సంఘం నేతలు బొంతల చంద్రారెడ్డి, ప్రొఫెసర్ అరబండి ప్రసాదరావు ప్రసంగించారు.