ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
పుట్టపర్తి అర్బన్: జాతీయ చేనేత దినోత్సవాన్ని చేనేతలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం నగర పంచాయతీ పరిధిలోని ఎనుములపలిలో చేనేత సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చరఖాకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ చేనేతలు ఐక్యతతో ముందుకు సాగుతూ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన మరమగ్గాలు నేత కార్మికుల పొట్ట కొడుతున్నాయన్నారు.ప్రభుత్వాలు చర్యలు తీసుకుని వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు సుధాకర్, బీజేఎంఎం జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతిప్రసాద్, చేనేత సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, ఊట్ల సోము, ఆశ్వర్థప్ప తదితరులు పాల్గొన్నారు.