బందరులో కార్డన్ సెర్చ్
మచిలీపట్నం : కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని నవీన్ మిట్టల్ కాలనీలో పోలీసులు శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. సరైన పత్రాలు లేని 12 వాహనాలను పోలీసులు సీజ్ చేసి..పోలీస్ స్టేషన్కు తరలించారు.