Nayan Mongia
-
సెలక్షన్ ప్యానెల్; రేసులో అగార్కర్, మోంగియా
న్యూఢిల్లీ: సెలక్టర్ల ఎంపికకు సంబంధించిన ప్రక్రియను బీసీసీఐ క్రికెట్ అడ్వైజరి కమిటీ (సీఏసీ) వేగవంతం చేసింది. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్ నాయకత్వంలోని సీఏసీ.. సెలక్షన్ ప్యానెల్(పురుషుల క్రికెట్) నియామక ప్రక్రియను గురువారం ప్రారంభించింది. ఈ మేరకు అజిత్ అగార్కర్, చేతన్ శర్మ, మనీందన్ సింగ్, నయన్ మోంగియా, ఎస్ఎస్ దాస్ పేర్లను షార్ట్‌లిస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు అభయ్ కురువిల్లా, అజయ్ రత్రా, నిఖిల్ చోప్రా, దేవాశిష్ మహంతి, రణదేవ్ బోస్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అర్హులైన వారిని వర్చువల్‌గా ఇంటర్వ్యూ చేసి తుది నిర్ణయం తీసుకోనుంది.(చదవండి: 'నీకు చాన్స్ ఇద్దామనే అలా చేశా') కాగా స్క్రూటినీ అనంతరం సీఏసీ ఎంపిక చేసిన పేర్లను బీసీసీఐకి పంపిస్తుంది. ఇక గురువారం బీసీసీఐ జనరల్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో సెలక్టర్ల నియామకానికి సంబంధించిన ప్రకటన నేడే వెలువడే అవకాశం ఉంది. జతిన్ పరంజపే, దేవాంగ్ గాంధీ, సరణ్దీప్ సింగ్ పదవీకాలం సెప్టెంబరులో పూర్తైన నేపథ్యంలో బీసీసీసీ దరఖాస్తులు ఆహ్వానించింది. కాగా సెలక్టర్‌గా ఎంపిక అయ్యేందుకు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడినవాళ్లు మాత్రమే అర్హులు. అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొని కనీసం ఐదేళ్లు పూర్తై ఉండాలి. వయోపరిమితి 60 ఏళ్లు. -
‘రోహిత్‌కు అంత ఈజీ కాదు’
న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్లో అడపా దడపా అవకాశాలు దక్కించుకునే టీమిండియా పరిమిత ఓవర్ల స్పెషలిస్టు ఓపెనర్ రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌కు ఎంపికైన నేపథ్యంలో అతను ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడు అనే విషయం చర్చకు వచ్చింది. ఈ సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను తప్పించడంతో రోహిత్ శర్మ ఓపెనర్‌గానే బరిలోకి దిగడం అనేది దాదాపు ఖాయం. ఈ విషయంపై చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ వివరణ ఇచ్చే క్రమంలో రోహిత్‌ను ఓపెనర్‌గా టెస్టుల్లో కూడా పరీక్షించాలనుకుంటున్నామని తెలిపాడు. అంతకుముందు భారత దిగ్గజ ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు కూడా రోహిత్‌ను టెస్టు ఓపెనర్‌గా దింపడానికి మద్దతుగా నిలిచారు. కాగా, రోహిత్ టెస్టు ఓపెనర్‌గా సక్సెస్ కావడం అంత ఈజీ కాదని అంటున్నాడు మాజీ వికెట్ కీపర్ నయాన్ మోంగియా. ఈ కొత్త ప్రపోజల్ భారత్‌కు లాభించకపోవచ్చని పేర్కొన్నాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా కొన్ని మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న మోంగియా.. ఈ ఫార్మాట్లో ఓపెనింగ్ అనేది అంత ఈజీ కాదని అభిప్రాయపడ్డాడు. ‘టెస్టుల్లో ఓపెనింగ్ అనేది ఒక ప్రత్యేకమైన జాబ్. వికెట్ కీపింగ్ తరహాలో టెస్టుల్లో ఓపెనర్‌గా సెట్ కావడం కష్టంతో కూడుకున్న పని. రోహిత్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్‌గా సక్సెస్ కావడం వేరు.. టెస్టుల్లో ఓపెనింగ్ స్థానంలో రాణించడం వేరు. ఇక్కడ ఒక ప్రత్యేక మైండ్‌సెట్‌తో ఆడాలి. పరిస్థితులకు తగ్గట్టు మైండ్ సెట్‌ను మార్చుకుంటూ ఉండాలి. వన్డే, టీ20ల్లో తరహాలో ఆడితే ఇక్కడ కుదరదు. టెస్టు క్రికెట్ అనేది ఒక విభిన్నమైన ఫార్మాట్. ఒకవేళ టెస్టు క్రికెట్లో రోహిత్ ఓపెనర్‌గా సెట్ అయితే, అప్పుడు అది అతని పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది’ అని మోంగియా తెలిపాడు.