ఆసుస్ జెన్ఫోన్ కొత్త సెల్ఫీ స్మార్ట్ ఫోన్
న్యూఢిల్లీ: తైవాన్ కు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఆసుస్ కొత్త స్మార్ట్ ఫోన్ ను బుధవారం లాంచ్ చేసింది. జెన్ఫోన్సె ల్ఫీ స్మార్ట్ పోన్ కొత్త వెర్షన్ ను మార్కెట్ లో విడుదల చేసింది. దీనిధరను రూ 12.999 గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇది అమెజాన్ లో అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ నుంచి ఇతర రిటైల్ కేంద్రాల నుంచి కొనుగోలు చేయవచ్చని తెలిపింది.. మైక్రో ఫోటోగ్రఫీని తమ లేటెస్ట్ డివైస్ సపోర్టు చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ అప్ డేటెడ్ స్మార్ట్ ఫోన్ లోని 88 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్ ద్వారా సెల్ఫీ పనోరమ ను సృష్టించుకోవచ్చని,6సీఎం పైగా ఉన్న వస్తువులను కాప్చర్ చేయొచ్చని తెలిపింది. స్టన్నింగ్ డైమండ్ కట్ డిజైన్ తో వస్తున్న ఈ ఫోన్ తో అద్భుతమైన సెల్ఫీ ఫోటోలను తీసుకోచ్చని కంపెనీసౌత్ ఆసియా హెడ్ పీటర్ చాంగ్ తెలిపారు.
ఆసుస్ జెన్ఫోన్ సెల్ఫీ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు
5.5 ఇంచెస్ స్ర్కీన్,
615 క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్
3 జీబీ రామ్,
16జీబీ మొమరీ, 128జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ,
ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్
13 ఎంపీ రియర్ కెమెరా
13 ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఆటో లేజర్ ఫోకస్, డ్యుయల్ కలర్ రియల్ టోన్ ఫ్లాష్
3000ఎంఏహెచ్ బ్యాటరీ