ఆ చెట్టుకు ఆకుల్లేవ్.. అన్నీ పూలే!
దుబ్బాక పసుపు వర్ణంలో మిలమిలా మెరిసి పోతున్న ఈ చెట్టు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆకులు లేకుండా చెట్టంతా గుత్తులు గుత్తులుగా పసుపు పచ్చని పూలతో విరబూసిన ఈ చెట్టు ఆహ్లాదాన్ని పంచుతోంది.
మెదక్ జిల్లా దుబ్బాక మండలం మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఈ చెట్టు పూలతో నిండుగా దర్శనమిస్తూ ప్రతి ఒక్కరిని కట్టి పడేస్తోంది. అటు రోడ్డుపై వెళ్లే వారు.. ఇటు పోలీస్ స్టేషన్ కు వచ్చేవారు సైతం ఆ చెట్టును చూసి పులకిస్తున్నారు.