ఆపిల్ వాచ్2 లిమిటెడ్ ఎడిషన్
న్యూఢిల్లీ : ఆపిల్, నైక్ భాగస్వామ్యంలో తమ ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ వాచ్ ను లిమిటెడ్ ఎడిషన్‌లో తీసుకొచ్చాయి. గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన ఆపిల్ వాచ్ సిరీస్ 2లో నైక్+ లిమిటెడ్ ఎడిషన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. మరో నైక్ స్పెషిఫిక్ ఎడిషన్‌ను లాంచ్ చేసేందుకు టెక్ కంపెనీ ఆపిల్ సిద్ధమవుతోంది. ఏప్రిల్ 27 నుంచి ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ విక్రయానికి వస్తోందని కంపెనీ తెలిపింది. నైక్.కామ్, ఆపిల్ స్టోర్‌లో రెండింట్లో ఇది అందుబాటులో ఉండనున్నట్టు కంపెనీ పేర్కొంది.
ఆపిల్ వాచ్ సిరీస్ 2 ఎడిషన్, వాచ్ఓస్ 3తో రన్ అవుతుంది. డ్యూయల్-కోర ప్రాసెసర్ కలిగి ఉన్న ఈ వాచ్, బెటర్ గ్రాఫిక్స్, ప్రదర్శన కోసం కొత్త జీపీయూను కూడా కలిగిఉంది.. ఒరిజినల్ ఆపిల్ వాచ్ కంటే రెండింతలు ప్రకాశంతమైన రెండో తరం జనరేషన్ ఓలెడ్ డిస్ప్లేతో ఇది రూపొందింది. జీపీఎస్‌తో పాటు 50 మీటర్ వాటర్ రెసిస్టెంట్ దీనిలో ఉంది. 38ఎంఎం, 42ఎంఎం రెండు డిఫరెంట్ సైజుల్లో ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.