ఆమరణదీక్ష చేస్తున్న నిత్యానంద రెడ్డి అరెస్ట్
కడప: వైఎస్ఆర్ జిల్లా కడపలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆమరణదీక్ష చేస్తున్న వైఎస్ఆర్ పిసి సేవాదళ్ అధ్యక్షుడు నిత్యానంద రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతనిని రిమ్స్‌కు తరలించారు.
సమైక్యాంధ్ర కోసం కడప కలెక్టరేట్ వద్ద నిత్యానంద రెడ్డి ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన దీక్ష ఆరవ రోజుకు చేరింది. నిత్యానంద రెడ్డి దీక్షకు పలువురు మద్దతు తెలిపారు.