No Tobacco Day
-
తండ్రికి ఇచ్చిన మాట కోసం సచిన్ ఏం చేశాడంటే..?
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (మే 31) సందర్భంగా ముంబైలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కెరీర్ ప్రారంభంలో పొగాకు ఉత్పత్తుల ప్రమోషన్స్ కోసం భారీ ఆఫర్లు వచ్చాయని, పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేయనని తన తండ్రికి ఇచ్చిన మాట కోసం వాటిని తిరస్కరించానని సచిన్ చెప్పుకొచ్చారు. Sachin Tendulkar said, "tobacco companies offered me a blank cheque in the past to promote them, but I promised my father that I'll never promote it as he said I'm a role model and people will follow what I do". pic.twitter.com/oi5jqgYroJ — Mufaddal Vohra (@mufaddal_vohra) May 31, 2023 పొగాకు కంపెనీలు తమ తరఫున ప్రచారం చేయమని బ్లాంక్ చెక్‌లు ఇచ్చేవారని, అయినా ఏ రోజు వారికి ఓకే చెప్పలేదని తెలిపారు. తన సహచరుల్లో చాలామంది బ్యాట్‌పై పొగాకు ఉత్పత్తుల (సిగరెట్) స్టిక్కర్లు అంటించుకుని ప్రచారం చేసే వారని, తాను కెరీర్ ఆరంభంలో రెండేళ్ల పాటు ఏ అడ్వర్టైజ్మెంట్ స్టిక్కర్‌ను తన బ్యాట్‌పై అంటించుకోలేదని తెలిపారు. తన తండ్రి తాను ప్రజలకు రోల్ మోడల్‌గా ఉండాలని కోరుకున్నారని.. నేను చేసే ప్రతి పనిని వారు అనుకరించే ప్రయత్నం చేస్తారని ఆయన చెప్పారని, అందుకే పొగాకు ఉత్పత్తుల ప్రచారానికి దూరంగా ఉంటున్నానని పేర్కొన్నారు. తన తండ్రికి ఇచ్చిన మాటకు నేటికీ కట్టుబడి ఉన్నానని.. మున్ముందు కూడా పొగాకు ఉత్పత్తులకు ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయనని సచిన్ స్పష్టం చేశారు. చదవండి: AsiaCup 2023: కొత్త ట్విస్ట్.. పాక్ లేకుండానే టోర్నీ నిర్వహణ! -
World No Tobacco Day: పొగాకు నమలడంతో వచ్చే సమస్యలివి..
పొగాకు ఏ రూపంలో వాడినా అది పూర్తిగా ప్రమాదకరం. అది అనేక నోటి సమస్యలకు, నోటి దుర్వాసనకు, చిగుర్ల వ్యాధులకు కారణం. అంతేకాదు ప్రాణాంతకమైన ఎన్నెన్నో క్యాన్సర్లకు దారితీసే ప్రమాదం ఉంది. నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్, జీర్ణవ్యవస్థలో వచ్చే ఎన్నో రకాల క్యాన్సర్లతో పాటు, ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ముఖ్యంగా పొగాకు వినియోగమే ప్రధాన కారణం. సాధారణంగా పొగాకును రెండు రకాలుగా వాడుతుంటారు. 1. పొగను వెలువరించేలా వాడటం: సిగరెట్లు, బీడీలు, పైప్‌లు, చుట్ట (సిగార్). 2. పొగ రాకుండా వాడటం : ఇందులో పొగాకును... గుట్కా, ఖైనీ, తంబాకు, జర్దా వంటి రూపాల్లో నములుతుంటారు. ఇవన్నీ నోటి ద్వారా తీసుకునే పొగాకు ఉత్పాదనలు కాగా... ఇక ముక్కు ద్వారా ముక్కుపొడి (స్నఫ్)ని కొందరు వాడుతుంటారు. అది కేవలం అపోహ మాత్రమే... కొందరిలో ఓ అపోహ ఉంటుంది. అదేమిటంటే... సిగరెట్, బీడీ, చుట్ట, హుక్కా... ఇలా పొగాకును కాల్చడం ద్వారా పొగవచ్చేలా వినియోగించడం కంటే... పొగ ఏమాత్రం వెలువడకుండా పొగాకును కింది పెదవి కింద పెట్టుకొని పీలుస్తూ ఉండటం, తాంబూలంలో కొద్దిగా జర్దా రూపంలో వేసి తినడం పెద్దగా ప్రమాదం కాదనే అపోహలో ఉంటారు. కానీ నిజానికి పొగవచ్చేలా పొగతాగడం కంటే... పొగ వెలువడని విధంగా పొగాకు వాడకం వల్ల కలిగే క్యాన్సర్లు చాలా ఎక్కువ. ఇలా పొగాకు నమలడం వల్ల దాదాపుగా 30 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా. లక్షణాలు గమనించండి... డాక్టర్‌ను సంప్రదించండి : నోట్లో చాలాకాలం వరకు తగ్గని పుండ్లు (అల్సర్స్) నోటిలో ఎక్కడైనా కండ పెరగడం తెల్లని మచ్చ కనిపించడం నమలడంలో ఇబ్బంది నోటి/నాలుక/దవడ కదలికలు మందగించడం చాలాకాలం పాటు గొంతు బొంగురు గా ఉండటం గొంతులో ఏదో అడ్డుగా ఉన్నట్లు అనిపించడం... ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు వచ్చే ఎన్నో వ్యాధులను ముందుగానే నివారించడం సాధ్యమవుతుంది. అందునా ఏ రకమైన క్యాన్సర్ అయినా ముందుగానే గుర్తిస్తే చాలావరకు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే పొగాకు వాడేవారిలో పైన పేర్కొన్న లక్షణం ఏది కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. ఇక క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులను దరిచేరనివ్వకుండా చేసుకోడానికి తక్షణం పొగాకు అలవాటును మానేయాలి. అది పొగతాగడమైనా లేదా పొగాకు నమలడమైనా.... అలవాటేదైనా సరే అంతే ప్రమాదకరమని గుర్తించాలి. ఈ ఏడాది థీమ్ ‘‘క్విట్ టొబాకో టు బి విన్నర్’’ను అనుసరించి పొగాకు వినియోగాన్ని వదిలేసి విజేతగా నిలవాలి. అలాగే ఈసారి నినాదమైన ‘కమిట్ టు క్విట్...’ స్ఫూర్తితో వెంటనే పొగాకును విసర్జించి, మళ్లీ ఎప్పుడూ తాకనంటూ ప్రతిజ్ఞ తీసుకోవాలి. పొగాకు నమలడంతో వచ్చే సమస్యలివి... పళ్ల అసహ్యకరమైన రీతిలో పచ్చగా మారతాయి. పళ్ల మీద మరకలు, మచ్చలు ఏర్పడతాయి ∙నోటి నుంచి దుర్వాసన వస్తుంది నోటికి రుచులు, ముక్కుకు వాసన లు తెలియవు ∙నోటిలో ఊరే లాలాజలం తగ్గుతుంది. దాంతో పళ్లు దెబ్బతింటాయి. చిగుర్ల సమస్యలూ వస్తాయి పిప్పిపళ్లు, చిగుర్ల సమస్యలు వస్తాయి. పంటి మీది ఎనామిల్ దెబ్బతింటుంది. చిగుర్ల లైన్ కిందికి వెళ్తుంది ∙వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దాంతో వాటంతట అవే తగ్గిపోయే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా అపాయకరంగా మారవచ్చు పొగాకు నమలడం వల్ల నోట్లోకి వెలువడే హానికరమైన విషద్రవాల ప్రభావం వల్ల చిగుర్లపైన, పెదవులపైన, గొంతులోన దుష్ప్రభావాలు చూపుతుంది. నోటిలోపలి మృదుకణజాలంపై పుండ్లు పడే (ల్యూకోప్లేకియా అవకాశాలు మరింతగా పెరుగుతాయి. దీనివల్ల నోరు, గొంతు, ఊపిరితిత్తులకు గాలిని అందించే మార్గంలోనూ, ఆహారనాళం క్యాన్సర్లు రావచ్చు. కీలక అవయవాలకూ హానికరమే పొగాకు వల్ల గుండెకు నేరుగా హాని జరుగుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి ఊపిరితిత్తులు దెబ్బతింటాయి కణంలోని జన్యు పదార్థాలు / డీఎన్ఏకు హాని జరుగుతుంది. చదవండి: Coronavirus: తగ్గిపోయాక పాలివ్వచ్చా? -
విసిరి పారేశారు
లాస్ట్ పఫ్ ‘నో టొబాకో డే’ సందర్భంగా సిగరెట్లో నికోటిన్ ఉంటుంది. సిగరెట్ తాగడంలో స్టయిల్ ఉంటుంది. నికోటిన్ ఇచ్చే కిక్ కన్నా, స్టెయిల్ ఇచ్చే కిక్కే యూత్‌ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది! బడ్డీ కొట్టుకు వెళ్లి, సిగరెట్ కొనుక్కుని, నోట్లో పెట్టుకుని, వెలిగించి, గుండె నిండా దమ్ము పీల్చనవసరం లేదు. అక్కడ స్క్రీన్ మీద ఫేవరెట్ హీరో దమ్ము కొడుతున్నా చాలు, ఇక్కడ సీట్లో ఫాన్స్‌కి కిక్ ఎక్కుతుంది. హీరో వరకు ఎందుకు? విలన్ ఉఫ్‌మని పొగను వదులుతున్నా... ఆ వదలడంలో కుర్రాళ్లకు హీరోయిజమే కనిపిస్తుంది. ఇక స్మోకింగ్ అలవాటవడం ఎంతసేపు చెప్పండి? అసలు నిజమైన హీరోలు ఎవరో తెలుసా? సిగరెట్ మానేసినవాళ్లు. అలాంటి రియల్ హీరోలు కొందరు స్క్రీన్‌పైన కూడా ఉన్నారు. నేడు ‘నో–టొబాకో–డే’ కాబట్టి... ఒకరిద్దరు నో–స్మోకింగ్ హీరోల నుంచి ‘మానే దమ్ము’ను స్ఫూర్తిగా పొందడం టైమ్లీగా ఉంటుంది. ఇంతకీ ఎవరా రియల్ హీరోలు? సల్మాన్ ఖాన్ సార్‌కి 2013లో నెర్వ్ ట్రీట్మెంట్ జరిగింది. ప్రాబ్లం ఏంటీ అని డాక్టర్లని అడిగితే... ‘స్మోకింగ్’ కూడా ఒక కారణం అని చెప్పారు. వార్నింగ్ బెల్ మోగింది! తక్షణమే సిగరెట్‌కి బై చెప్పేశాడు. గ్రేట్! హృతిక్ రోషన్ సిగరెట్ మానేయడానికి హృతిక్ చాలా కష్టపడ్డాడు. ఓసారి అనుకోకుండా ‘ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్’ అనే పుస్తకం చదివాడు. ఆ పుస్తకం రాసింది అలెన్కార్ అనే చైన్‌స్మోకర్. పుస్తకం చివరి పేజీ చదివిన రోజే తన చివరి సిగరెట్ కాల్చాడు. నైస్! ఆమిర్ ఖాన్ ఆమిర్ అప్పుడప్పుడు స్మోక్ చేసేవాడు. ‘అది కూడా ఎందుకు పప్పా’ అని పిల్లలు జునాయిడ్, ఇరా అడిగేసరికి.. సిగరెట్ మానాలని ట్రై చేశాడు. ఫైనల్‌గా 2011లో చిన్న కొడుకు అజాద్ పుట్టాక ధూమపానం నుంచి విముక్తుడయ్యాడు. ఆసమ్! సైఫ్ అలీ ఖాన్ సైఫ్‌కి 2009లో హార్ట్ ఎటాక్ వచ్చింది. ‘స్మోకింగ్ మానేస్తే మీ గుండెకు మంచిది’ అని డాక్టర్లు చెప్పారు. చెప్పింది విన్నాడు. ‘సిగరెట్ మానండోయ్ బాబూ..’ అని కొన్నాళ్లు ప్రజాహితార్థం ప్రచారం కూడా చేశాడు. వావ్! వివేక్ ఒబెరాయ్ ఒకప్పుడు ధారాళంగా పొగ తాగిన ఒబేరాయ్కు.. ముంబైలోని ఒక ఆసుపత్రిలో క్యాన్సర్ పేషెంట్లతో గడిపాక జ్ఞానోదయం అయిందట. అప్పట్నుంచీ తాను తాగడు, సెట్లో ఎవర్నీ తాగనివ్వడు. వండర్ఫుల్! అజయ్ దేవగణ్ ‘నా మాట నేనే వినను..’ అన్న అజయ్ చివరికి తన బాడీ మాట వినవలసి వచ్చింది. బాడీ తో పాటు భార్య కాజోల్ కూడా ‘మానేద్దురూ’ అని బతిమాలింది. ఆమె మాట విని సిగరెట్‌ని క్విట్ చేసేశాడు అజయ్. వైజ్! అర్జున్ రాంపాల్ ఆమిర్ ఖాన్ లానే ఈయన కూడా పిల్లల కోసమే సిగరెట్లు మానేశాడు. అర్జున్ భార్య మెహర్‌కు కూడా సిగరెట్ తాగే అలవాటు ఉండేది. ఆమె మానేయడంతో, ఆమె ఇన్స్పిరేషన్తో ఈయనా మానేశాడు. లవ్లీ! రణ్‌బీర్ కపూర్ డైరెక్టర్ అనురాగ్ బసుతో బెట్ కట్టి మరీ సిగరెట్ హ్యాబిట్కు టాటా బై బై చెప్పేశాడు రణబీర్. అంతేకాదు, ఎవరికైనా తను సిగరెట్ తాగుతూ కనిపిస్తే తనని చంపేయవచ్చట. తనని కాల్చేయవచ్చట. తనని అబద్దాల కోరు అనేయవచ్చట. సో స్వీట్!