'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' విడుదలకు రెడీ అయిపోయింది. తెలుగులో పెద్దగా బజ్ లేదు. అయితే రీసెంట్గా విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు కాస్త పెరిగాయి. రజినీ స్టైల్, స్వాగ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఎందుకంటే తలైవాకు సరైన హిట్ పడి చాలా కాలమైపోయింది. ఇలాంటి టైంలో 'జైలర్' ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ఓ వివాదం
'జైలర్' ఎలా ఉండబోతుందో అనే విషయం ఆగస్టు 10న తెలిసిపోతుంది. కాపీ అనేది పక్కనబెడితే ఇప్పటికే టైటిల్ విషయమై ఓ వివాదం నడిచింది. 'జైలర్' టైటిల్ తమదని మలయాళ దర్శకుడు సక్కిర్ మడతిల్ కోర్టుని ఆశ్రయించారు. మార్కెట్ పరంగా తమ చిత్రానికి నష్టం రాకూడదని సన్ పిక్చర్స్ సంస్థ కోర్టుని ఆశ్రయించింది. ఆగస్టు 2న హియరింగ్ జరగ్గా.. తీర్పు ఏంటనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్)
కథ కాపీ కొట్టారా?
ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం.. 'జైలర్' ఫస్టాప్‌లో ఓ అమాయకుడిలా కనిపిస్తాడు. ఇంట్లో కొడుకు, మనవడు, భార్య.. ఇలా ప్రతి ఒక్కరూ అతడితో ఆడేసుకుంటూ ఉంటారు. అయితే అతడు బయటకు కనిపిస్తున్నది వేరు, గతం వేరే అనే విషయం తెలుస్తుంది. తనలో అసలు సిసలు యాక్షన్ ని బయటకు తీస్తాడు. తర్వాత ఏం జరిగింది? అనేది స్టోరీ అని తెలుస్తోంది.
కథ ఒకేలా ఉందే?
అయితే 'జైలర్' సినిమాకు 2021లో వచ్చిన హాలీవుడ్ మూవీ 'నోబడీ'తో పోలికలు కనిపిస్తున్నాయి. ఇందులోనూ ఓ వయసైపోయిన వ్యక్తి.. భార్యబిడ్డలతో బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో రష్యన్ మాఫియాతో తలపడతాడు. తనని 'నోబడీ' అనుకున్న వాళ్లందరికీ షాకిస్తాడు. 'జాన్ విక్' టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య పోలికలు కనిపిస్తుండడంతో కాపీ కొట్టారనే ప్రచారం జరుగుతోంది. థియేటర్లలోకి 'జైలర్' వస్తే గానీ దీనిపై క్లారిటీ రాదు.
(ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక)