తెలంగాణలో ఉత్తరాంధ్ర జిల్లాలను కలపాలి:రేణుక
ఢిల్లీ: తెలంగాణలో ఉత్తరాంధ్ర జిల్లాలను కలపాలనేది తన ఆలోచన అని ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి చెప్పారు. తెలంగాణ ప్రకటించినందుకు మెదక్ ఎంపి విజయశాంతి సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారన్నారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరతారని విలేకరులు ప్రశ్నించగా, ఎప్పుడు చేరతారో ఆమెనే అడగాలన్నారు.
తాను తెలంగాణ ఆడబిడ్డనని రేణుకా చౌదరి చెప్పారు. తెలంగాణపై సీఎంకు ఒక అభిప్రాయమంటూ ఏమీ ఉండదన్నారు. సీడబ్ల్యూసీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు.