నోట్ల రద్దుపై నినదించిన కాంగ్రెస్
కలెక్టరేట్ ఎదుట పార్టీ నేతల ధర్నా
కాకినాడ :
నోట్ల రద్దు వెనుక ఉన్న వాస్తవాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పంతం నానాజీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు జెడ్పీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి బైఠాయించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ పరిశీలకులు ఉగ్రప్ప మాట్లాడుతూ నోట్ల రద్దు తరువాత ఇప్పటి వరకు ఎంత నల్లధనాన్ని వెలికి తీశారని ప్రశ్నించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పంతం నానాజీ మాట్లాడుతూ తక్షణమే నగదు తీసుకోవడంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కాంగ్రెస్ బీసీసెల్ కార్యదర్శి నులుకుర్తి వెంకటేశ్వరరావు, రాజమండ్రి, కాకినాడ నగర అధ్యక్షులు ఎ¯ŒSవీ శ్రీనివాస్, కంపర రమేష్, పీసీసీ ఉపాధ్యక్షుడు ఏజేవీ బుచ్చి మహేశ్వరరావు, వివిధ నియోజకవర్గాల ఇ¯ŒSచార్్జలు అద్దంకి ముక్తేశ్వరరావు, ఆకుల రామకృష్ణ, పంతం ఇందిర, జిల్లా యూత్ అధ్యక్షుడు బోడా వెంకట్రావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్థినీడి సుజాత, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.