ఇరాక్ ప్రధాని రాజీనామా
బాగ్దాద్: అంతర్యుద్ధంతో అట్టడుకుతున్న ఇరాక్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాని నౌరి అల్-మాలికి తన పదవికి రాజీనామా చేశారు. ఇరాక్‌లో ప్రభుత్వ బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఇరాక్‌లో చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి.
2011లో అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ఇరాక్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సంక్షోభం ఇదే. స్వదేశంలో తిరుగుబాట్లు, అంతర్జాతీయ స్థాయి ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా రాజీనామా చేస్తున్నట్టు మాలికి ప్రకటించారు.