నేటి ‘ఇంటర్ సప్లిమెంటరీ’ వాయిదా
హైదరాబాద్: పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ బంద్‌కు పిలుపునివ్వడంతో గురువారం జరగాల్సిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగే ప్రథమ, ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్-బి, హిస్టరీ, జువాలజీ పరీక్షలను వాయిదా వేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీని గురువారం ఖరారు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.