సీమా పూనియాకు గోల్డ్ మెడల్
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ ఐదో స్వర్ణం సాధించింది. మహిళల డిస్కస్ త్రో విభాగంలో భారత క్రీడాకారిణి సీమా పూనియా పసిడి పతకం గెల్చుకుంది. 61.03 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది.
ప్రీస్టయిల్ రెజ్లింగ్ లో భారత్ రెండు పతకాలు కైవసం చేసుకుంది. 61 కిలోల ప్రీస్టయిల్ రెజ్లింగ్ లో బజరంగ్ రతజ పతకం గెలిచాడు. 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. 300 మీటర్ల స్టిపెల్చేజ్ లో నవీన్ కుమార్ కాంస్యం దక్కించుకున్నాడు. మహిళల 1500 మీటర్ల రేస్ లో ఓపీ జైషా కాంస్య పతకం సొంతం చేసుకుంది.