ఓబీసీ మహిళలకు సబ్‌కోటా ఇవ్వండి
* ఓబీసీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని కోరుతూ ఆలిండియా ఓబీసీ మహిళా సమాఖ్య సభ్యులు సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. 545 మంది పార్లమెంట్ సభ్యుల్లో మహిళా ఎంపీలు పదుల సంఖ్యలో ఉండడం బాధాకరమని సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి అన్నారు.
ఓబీసీ మహిళా ఎంపీల సంఖ్య మరింత పెరిగేలా అవకాశాలు కల్పించాలని కోరారు. ధర్నాకు టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ సంఘీభావం తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిలుపై గతంలో తమ పార్టీ తరఫున పార్లమెంట్లో ప్రస్తావించామని చెప్పారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ, జ్యోతిరావ్‌ఫూలే, సావిత్రీబాయి ఫూలేకు భారత రత్న ఇవ్వాలని కోరారు.