offline retailers
-
ఆఫ్‌లైన్ రిటైల్‌లోకి బిగ్‌బాస్కెట్
న్యూఢిల్లీ: ఆన్లైన్లో నిత్యావసర సరుకులు విక్రయించే బిగ్‌బాస్కెట్ తాజాగా ఆఫ్‌లైన్ రిటైల్ విభాగంలోకి ప్రవేశించింది. కొత్తగా టెక్నాలజీ ఆధారిత, సెల్ఫ్ సర్వీస్ ’ఫ్రెషో’ స్టోర్‌ను బెంగళూరులో ప్రారంభించింది. 2023 నాటికి దేశవ్యాప్తంగా 200 భౌతిక స్టోర్లు, 2026 నాటికి 800 స్టోర్లు ఏర్పాటు చేయాలన్న ప్రణాళికల్లో భాగంగా దీన్ని ఆవిష్కరించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హరి మీనన్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులను పోటీ సంస్థలతో పోలిస్తే మరింత చౌకగా వీటి ద్వారా అందించాలన్నది తమ లక్ష్యమని ఆయన వివరించారు. ఈ స్టోర్స్‌లో తాజా పండ్లు, కూరగాయలతో పాటు బ్రెడ్, గుడ్లు మొదలైన నిత్యావసరాలు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. బిగ్‌బాస్కెట్‌లో 50,000 ఉత్పత్తుల శ్రేణి నుంచి కొనుగోలుదారులు తమకు కావాల్సినవి ఆన్లైన్లో ఆర్డర్ చేసి, తమ వీలును బట్టి ఫ్రెషో స్టోర్స్ నుంచి వాటిని తీసుకోవచ్చని మీనన్ చెప్పారు. కస్టమర్లు తమకు కావాల్సిన ఉత్పత్తులను తీసుకుని, ఆటోమేటిక్ కంప్యూటర్ విజన్ ఉండే కౌంటర్లో తూకం వేయొచ్చని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సెల్ఫ్ బిల్లింగ్ కౌంటర్లు ఆటోమేటిక్‌గా బిల్లును రూపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. -
సఖ్యతకు నోచుకోని ఈ-టైలర్స్..!
భారత్ లో రిటైలర్ సంస్థలకున్న సఖ్యత ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు ఉండట్లేదట. ఇష్టారీతిలో డిస్కౌంట్ ఆఫర్లు గుప్పిస్తూ భారీగా వ్యాపారాన్ని పెంచుకుంటున్న ఈ-టైలర్స్ కు చెక్ చెప్పేందుకు ప్రభుత్వం ఏప్రిల్ లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ పోర్టల్ లో ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉండొద్దని ఆదేశాలు జారీచేసింది. వివిధ రాష్ట్రాల పన్నులనూ ఈ-టైలర్స్ భరించాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే వీటిపై పోరాటానికి ఈ-కామర్స్ దిగ్గజాలు ఐకమత్యం లేదని తెలుస్తోంది. ఆఫ్ లైన్ రిటైలర్లకు, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమైన పోరుకు మాత్రం ఈ-కామర్స్ దిగ్గజాలు ఒకే స్వరంలో ఉండటం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభావం ఈ-కామర్స్ వ్యాపారాలపై పడనుందని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ-కామర్స్ పరిశ్రమ విశ్లేషకులే దీనిపై పెదవి విరుస్తున్నారని తెలుస్తోంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు మాత్రం దీనిపై స్పందించడం లేదు. ముఖ్యమైన అంశాలపై కంపెనీ, స్టాక్ హోల్డర్స్ అందరితో కలిసే పనిచేస్తుందని స్నాప్ డీల్ ఏదో నామమాత్రంగా సమాధానమిచ్చిందని తెలుస్తోంది. ఆఫ్ లైన్ స్టోర్లు, వారు నిర్ణయించుకున్న ధర కంటే ఇసుమంతైనా తక్కువ చేసి మంచినీళ్ల బాటిళ్లను సైతం విక్రయించవని, ఇదే ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లకున్న ప్రధాన తేడా అని ఈ-టైలర్ ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. మార్కెట్ ప్లేస్ ప్రమోషన్ ను అనుమతివ్వాలని కోరుతూ ఈ కంపెనీలు అసలు కలిసికట్టుగా ప్రభుత్వంతో సంప్రదింపులే జరపడం లేదని తేలింది. ఇటీవలే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అమెరికా ఈ-టైలర్ దిగ్గజం అమెజాన్ స్పాన్సర్ చేసిన లేఖపై కూడా భారత ఈ-టైలర్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లు సంతకం చేయలేదట. దీంతో లాబీ గ్రూప్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ డ్రాప్ట్ లెటర్ ను ప్రభుత్వానికి పంపలేదట. గుజరాత్ ప్రభుత్వ పన్నులకు కూడా వ్యతిరేకంగా ఈ సంస్థలన్ని వేరువేరుగానే కేసులు ఫైల్ చేశాయి. అయితే ఈ-టైలర్స్ కు పోటీగా సమైక్యంగా పోరాడుతూ.. మార్కెట్లో తమ స్థానాలను మెరుగుపర్చుకునేందుకు రిటైల్ సంస్థలు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ)ను ఏర్పరుచుకున్నాయి. ఈ అసోసియేషన్ బేస్ చేసుకుని ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లపై వ్యతిరేకంగా రెండు కేసులు కూడా నమోదుచేశాయట. ఈ మొత్తం ఈ-టైలర్ల వ్యవహారాన్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ గా షాప్ క్లూస్.కామ్ సంస్థ సహా వ్యవస్థాపకుడు రాధిక అగర్వాల్ అభివర్ణించారు.