Oil & Gas Shares
-
గ్యాస్ వివాదాలపై నిపుణుల కమిటీ
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులపై వివాదాలు ప్రతికూల ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించింది. సుదీర్ఘ న్యాయపోరు సమస్యలు లేకుండా నిర్దిష్ట కాలవ్యవధిలోగా ఇంధనాల అన్వేషణ, ఉత్పత్తి సంబంధ వివాదాల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించింది. ఇందులో చమురు శాఖ మాజీ కార్యదర్శి జీసీ చతుర్వేది, ఆయిల్ ఇండియా మాజీ సీఎండీ బికాష్ సి బోరా, హిందాల్కో ఇండస్ట్రీస్ ఎండీ సతీష్ పాయ్ సభ్యులుగా ఉంటారని కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. కమిటీ కాల వ్యవధి మూడేళ్ల పాటు ఉంటుంది. వివాదాలను కనిష్టంగా మూడు నెలల్లో పరిష్కరించే అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం ద్వారా భాగస్వాముల మధ్య లేదా కాంట్రాక్టరు.. ప్రభుత్వం మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడంపై ఈ కమిటీ దృష్టి పెడుతుంది. ఇందుకోసం థర్డ్ పార్టీ సర్వీసులను కూడా తీసుకోవచ్చు. ఆర్బిట్రేషన్ కోసం నిపుణుల కమిటీని ఆశ్రయించిన తర్వాత.. మళ్లీ ప్రత్యేకంగా కోర్టుకు వెళ్లడానికి కుదరదు. అయితే, పరస్పర అంగీకారంతో సమస్య పరిష్కార ప్రక్రియ వ్యవధిని పెంచుకోవచ్చు. నిర్దిష్టంగా చట్టపరమైన అంశాలు ఉంటే తప్ప ఆయా సంస్థల ఉద్యోగులు, ఉన్నతాధికారులే.. కమిటీ ముందు వాదనలు వినిపించవచ్చు. అడ్వొకేట్లు, కన్సల్టెంట్ల పాత్రేమీ ఇందులో ఉండదు. -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆరంభంలో స్వల్ప లాభాలకు పరిమితమై, ఒడిదుడుకులకు లోనైనప్పటికీ చివరికి లాభాల్లో స్థిరంగా క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 183 పాయింట్లు జంప్‌చేసి 26,698 వద్ద , 51 పాయింట్లు ఎగసి నిఫ్టీ 8,222 వద్ద ముగిశాయి.. ముఖ్యంగా మిడ్‌సెషన్ నుంచీ పెరిగిన కొనుగోళ్లతో ప్రధాన ఇండెక్సులు జోరందుకుని లాభాలను ఆర్జించాయి. ప్రధానంగా ఆటో, ఐటీ , ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ లాభాలు మార్కెట్ నుప్రభావితం చేశాయి. ఫెడరల్ రిజర్వ్ పాలసీ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. దీంతో దేశీయంగానూ సెంటిమెంటు మెరుగుపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల్లో మీడియా, మెటల్, రియల్టీ నష్టాల్లో ముగిశాయి. టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, బీపీసీఎల్, విప్రో, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఐడియా, టాటా పవర్, బీవోబీ లాభపడగా అల్ట్రాటెక్, హిందాల్కో, జీ, భెల్, గ్రాసిమ్, గెయిల్, అంబుజా, లుపిన్, టాటా స్టీల్, ఏసీసీ నష్టపోయాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 0.07 పైసల నష్టంతో రూ.67.49 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి రూ. 141నష్టంతో రూ. 27,521 వద్ద బలహీనంగా ముగిసింది.