భారత టెస్టు చరిత్రలో దారుణమైన ఓటమి: గవాస్కర్
ముంబై: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోవడం భారత్టెస్టు చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిగా సునీల్ గవాస్కర్ అభివర్ణించారు. పూణే టెస్టు మ్యాచ్‌లో ఒకిఫ్ స్పిన్ మాయాజలానికి భారత్ 333 పరుగుల తేడాతో పరాజయం పొందింది. ఈ ఓటమిపై గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. భారత్ రెండున్నర రోజుల్లో ఆటముగించడం నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఆసీస్ స్పిన్నర్ల అటాకింగ్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, ఇది భారత క్రికెట్‌కు బ్లాక్ డేగా పేర్కొన్నారు.
భారత్ బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లను 75 ఓవర్లకు ముగించడం అసంతృప్తికి గురిచేసిందని గవాస్కర్ తెలిపారు. భారత ఆటగాళ్లు అత్యంత పేలవమైన ప్రదర్శన కనబర్చారని చెప్పారు. ట్రీ బ్రెక్ తర్వాత అరగంట సమయంలో భారత ఇన్నింగ్స్ ముగించడం నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఆటగాళ్లు కేర్లెస్గా ఆడారని , ఏ ఒక్కరు క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించలేదన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులు గ్రహించి మిగతా మ్యాచ్‌లకు సిద్దం కావాలని గవాస్కర్ ఆటగాళ్లకు సూచించారు.