మున్సిపాలిటీలకు లక్ష మరుగుదొడ్లు మంజూరు
శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ తరఫున లక్ష మరుగుదొడ్లు మంజూరయ్యాయని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు.
ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మున్సిపాలిటీల నుంచి ఇప్పటికే 3.30లక్షల మరుగుదొడ్ల నిర్మాణాలకు దరఖాస్తులు అందాయని చెప్పారు. ముందుగా లక్ష మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఒక్కొక్క మరుగుదొడ్డికి రూ. 15 వేలు ప్రభుత్వం తరఫున ఇవ్వనున్న విషయం తెలిసిందే.