one person dead
-
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నలుగురికి గాయాలు వెంకటాపూర్ వద్ద ఘటన ఎల్లారెడ్డిపేట : మండలంలోని వెంకటాపూర్ శివారులో ఎల్లమ్మ ఆలయం వద్ద బుధవారం జరిగిన రోడ్లు ప్రమాదంలో ఒకరు మృతిచెందాగా నలుగురు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిపేటకు చెందిన చందనం భాస్కర్(55)తన కూతురు హేమలత, మనుమడు భానుమహేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేటకు వస్తున్నాడు. బోయినిపల్లి మండలం వర్దవెళ్లి్లకి చెందిన మందాల జ్యోతి–కనుకయ్య దంపతులు టీవీఎస్ ఎక్సెల్‌పై ఎల్లారెడ్డిపేట నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. రెండు వాహనాలు వెంకటాపూర్ శివారులో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జ్యోతి పరిస్థితి విషమంగా ఉంది. భాస్కర్ మృతదేహాన్ని జెడ్పీటీసీ తోట ఆగయ్య ఆస్పత్రిలో సందర్శించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడికి భార్య అంజవ్వ, కూతుళ్లు హేమలత, అపర్ణ, కుమారులు అనిల్, హరీశ్ ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై ఉపేందర్ సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ ఢీకొని స్కూటరిస్ట్ దుర్మరణం
నెల్లూరు రూరల్ : బైక్‌పై రోడ్డు క్రాస్ చేస్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన జాతీయరహదారిపై గొలగమూడి క్రాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. నెల్లూరు రూరల్ పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన హరీష్‌కుమార్(31) తన స్నేహితులతో కలిసి గొలగమూడి రోడ్డులోని ఓ దాబాలో ఆదివారం అర్ధరాత్రి భోజనం చేసి తన బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. జాతీయ రహదారిని దాటుతుండగా చెన్నై నుంచి కావలి వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మతి చెందాడు. సమాచారం అందుకున్న నెల్లూరురూరల్ ఎస్ఐ శేఖర్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
అమెరికా ‘ఎన్ఎస్ఏ’ వద్ద కాల్పులు.. ఒకరి మృతి
వాషింగ్టన్: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా జాతీయ భద్రతా సంస్థ(ఎన్ఎస్ఏ) ప్రధాన కార్యాలయం సోమవారం ఉలిక్కిపడింది. మేరీలాండ్‌లోని ఈ కార్యాలయ ప్రాంగణంలోకి ఇద్దరు వ్యక్తులు అనుమతి లేకుండా దూసుకొచ్చేందుకు యత్నించడంతో గేటు వద్దే భద్రతా సిబ్బంది వారిపైకి కాల్పులు జరిపారు. ఇందులో ఒకరు మరణించగా.. మరొకరు గాయపడ్డారు. ఇది ఉగ్రవాద చర్య కాకపోవచ్చని అధికారులు తెలిపారు. దీనిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రారంభించింది. కీలక విభాగాలు ఉండే ఈ ఆఫీసులో 11 వేల మంది మిలటరీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. 29 వేల మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఘటనపై అధికారులు అధ్యక్షుడు బరాక్ ఒబామాకు వివరించారు.