ఘనంగా ఓనం వేడుకలు
పుట్టపర్తి టౌన్ : పట్టణంలోని పర్తిసాయి ధర్మశాలలో సాయికేరళ అసోషియేషన్ ఆధ్వర్యంలో కేరళీయులకు ప్రీతి పాత్రమైన ఓనం పర్వదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసినా రక్తదాన శిభిరాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్రాజు ప్రారంభించారు. జిల్లా అదనపు జడ్జి రాములు హాజరై ఓనం సందేశాన్ని కేరళీయులకు వినిపించారు. అనంతరం వేడుకల్లో పాల్గొన్న మంత్రి పల్లె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అహాన్ని వీడి సమాజ శ్రేయస్సుకు పాటుపడాలన్నారు. కేరళ నుంచి ప్రశాంతి నిలయానికి వచ్చి ఇక్కడ సమాఖ్య ఏర్పాటు చేసుకోవడం సంతోషదాయకమన్నారు. సత్యసాయి బోధనలను విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ప్రతి మనిషిపై ఉందన్నారు.
పుట్టపర్తిలో కేరళీయుల సమస్యలను పరిష్కరించేందుకు కషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా సంగీత విద్వాంసుడు పి.శ్రీనివాస్ నిర్వహించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ అలరించింది. అలాగే అఖిల్ యశ్వంత్ సోపానం సంగీతకచేరి నిర్వహించారు. కేరళ మహిళలు తిరువాతిరికలి, యురియాది, మ్యూజికల్ఛైర్ నిర్వహించారు. వేలాది మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కరణ్, సభ్యులు అనిల్కుమార్నాయర్, సత్యప్రకాష్, విజయ్, సత్యన్, మణిదాస్, రఘు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.