‘తిరుపతి సదస్సు’ను అడ్డుకున్న పోలీసులు
ఏపీలో ప్రజా సంఘాల అరెస్ట్
{Xన్హంట్ వ్యతిరేక కమిటీ సదస్సు రద్దు
తిరుపతి: ఆపరేషన్ గ్రీన్‌హంట్ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఆదివారం జరగాల్సిన సదస్సు వాయిదాపడింది. సమావేశానికి హాజరవుతారని ప్రకటించిన కమిటీ ముఖ్య నేతలను పోలీసులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా 41 ప్రజా సంఘాలతో ఏర్పాటైన కమిటీ సమావేశం తిరుపతిలో సీపీఐ కార్యాలయ ఆవరణలో ఆదివారం జరగాల్సి ఉంది. దీనికి కమిటీ కన్వీనర్, ప్రొఫెసర్ ఎస్.శేషయ్య అధ్యక్షత వహించాల్సి ఉంది. పౌర హక్కుల సంఘం, జనవిజ్ఞాన వేదిక, ప్రగతిశీల కార్మిక సంఘం, దేశభక ్త ప్రజాతంత్ర, విరసం తదితర ప్రజా సంఘాల నేతలు పాల్గొంటారని నిర్వాహకులు ప్రకటించారు. సమావేశానికి వచ్చేవారిని ఎక్కడికక్కడఅరెస్ట్ చేసినట్లు సమాచారం. సభావేదిక ఆవరణలోకి ఉదయం నుంచి ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సదస్సు నిర్వహించలేదు. ఈ సందర్భంగా సీపీఐ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా, ఏపీ, తెలంగాణ సీఎంల పరిపాలన ఎమర్జెన్సీని తలపించేలా సాగుతోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీమన్నారాయణ అక్కడ మీడియాతో అన్నారు.
నాయకుల గృహ నిర్బంధం
తిరుపతి సదస్సుకు వెళ్లకుండా పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేషయ్య, అనంతపురం జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు హరినాథరెడ్డిలను శనివారం రాత్రినుంచే గృహనిర్భందంలో ఉంచారు.