ఓటర్ల నమోదుకు నేడు ప్రత్యేక కార్యక్రమం
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : కొత్త ఓటర్ల నమోదుకు ఆదివారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ తెలిపారు. ఇప్పటివరకు ఓటరుగా నమోదు కాని అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని 2540 పోలింగ్ కేంద్రాల్లో ఫారం-6ను అందుబాటులో ఉంచామని, బూత్ స్థాయి అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. కళాశాలల్లో నియమితులైన క్యాంపస్ అంబాసిడర్లు 18 ఏళ్లు నిండిన విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. ఓటు హక్కు కలిగి ఉండడం, ఓటు వేయడం బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. www. ceoandhra.nic.in వెబ్సైట్ ద్వారా కూడా ఓటరుగా నమోదు కావచ్చని పేర్కొన్నారు.