భారీ పన్ను డిఫాల్టర్ల జాబితా జారీ
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్న ఆదాయపన్ను శాఖ తాజాగా జాబితా విడుదల చేసింది. భారీగా పన్ను ఎగవేత దారులు నేమ్ అండ్ షేమ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ అవమాన వ్యూహంలో భాగంగా రూ .10 కోట్లకుపైగా పన్నులు చెల్లించని ఢిల్లీకి చెందిన ఐదు సంస్థల పేర్లను ప్రచురించింది.
ఆదాయ పన్ను,కార్పొరేట్ టాక్స్ చెల్లించాల్సిన జాబితాను ప్రధాన జాతీయ జాతీయ దినపత్రికలకు జారీచేసిన ప్రకటనలోఐటీశాఖ విడుదల చేసింది. "పన్ను బకాయిలు వెంటనే" చెల్లించాలని కోరింది. పన్ను శాఖ యొక్క పాలసీ యంత్రాంగం ప్రత్యక్ష పన్నుల సెంట్రల్ బోర్డు (సిబిడిటి) గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ అవమాన పథకాన్ని ఆదాయం పన్ను శాఖ ప్రారంభించింది. ఈ క్రమంలో గతంలో 96 సంస్థలు గుర్తించింది. ఇవి గుర్తించలేకుండా లేదా రికవరీ కోసం ఎలాంటి ఆస్తులు లేకుండా మిగిలిపోయాయి.
ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ జారీ చేసిన ఒక నోటీసు లో ఈ జాబితాను వెల్లడి చేశారు. పాన్ కార్డు సంఖ్య, చివరిగా తెలిసిన చిరునామా, అంచనా పరిధి , పన్ను చెల్లించని మొత్తాన్ని, వ్యక్తిగత, సంస్థల వివరాలతో వెల్లడించినట్టు ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఈ సంస్థల చిరునామా, వ్యాపారం, వాటాదారుల నిర్వహణ మరియు నిర్వహణ వంటివి మారవచ్చు. ఈ సంస్థల గురించి సమాచారం తెలిసిన వారు, ఉపయోగకరమైన సమాచారం ఉంటే తమకు తెలియపర్చాల్సిందిగా కోరారు.
కాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ క్లీన్‌మనీ వెబ్‌సైట్‌ను మంగళవారం ప్రారంభించారు. నిజాయితీగల పన్ను చెల్లింపుదారులకు లబ్ది చేకూర్చేలా , పన్ను చెల్లింపులకు ప్రజలను ప్రోత్సహించేలా ఈ పోర్టల్‌ను లాంచ్ చేసినట్టు చెప్పారు. ఈ డిఫాల్టర్ల పేర్లను తన అధికారిక వెబ్ సైట్ లో కూడా ప్రచురించడం ప్రారంభించింది.