ovl
-
వోస్తోక్ ప్రాజెక్ట్‌పై ఓవీఎల్ దృష్టి
న్యూఢిల్లీ/ మాస్కో: విదేశీ అనుబంధ సంస్థ ద్వారా ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ.. రష్యాకు చెందిన భారీ ప్రాజెక్ట్ వోస్తోక్ ఆయిల్లో మైనారిటీ వాటా కొనుగోలు చేయాలని చూస్తోంది. ఇందుకు ఇప్పటికే ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్(ఓవీఎల్) చర్చలు నిర్వహిస్తున్నట్లు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. మరోపక్క లిక్విఫైడ్ గ్యాస్ ప్రాజెక్ట్ ఆర్కిటిక్ ఎల్ఎన్జీ–2లో మైనారిటీ వాటాను సొంతం చేసుకునే ప్రణాళికల్లో పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్కిటిక్‌లో 9.9 శాతం వాటాను నోవాటెక్ నుంచి కొనుగోలు చేసేందుకు పెట్రోనెట్ చర్చలు చేపట్టినట్లు వెల్లడించారు. వోస్తోక్ ఆయిల్ ప్రాజెక్టు 6 బిలియన్ టన్నులు లేదా 44 బిలియన్బ్యారళ్ల ప్రీమియం చమురు నిక్షేపాలు(రీసోర్సెస్) కలిగి ఉంది. ఇక ఎల్ఎన్జీ ఉత్పత్తికి రష్యాలో అతిపెద్ద సంస్థగా నిలుస్తున్న నోవాటెక్ 11 బిలియన్ డాలర్ల విలువైన ఆర్కిటిక్ ప్రాజెక్టులో 60 శాతం వాటాను కలిగి ఉంది. ఫ్రాన్స్ దిగ్గజం టోటల్, జపనీస్ కన్సార్షియం విడిగా 10 శాతం చొప్పున వాటాలను పొందాయి. చైనా కంపెనీ సీఎన్పీసీ, సీనూక్ లిమిటెడ్ మిగిలిన 20 శాతం వాటాను సమానంగా పంచుకున్నాయి. 2023కల్లా ఆర్కిటిక్ తొలి కన్సైన్మెంట్ను ప్రారంభించగలదని అంచనా. ఈ బాటలో 2025కల్లా 19.8 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని అందిపుచ్చుకోగలదని భావిస్తున్నారు. కొత్త పెట్టుబడులు..: రష్యాలో జరుగుతున్న తూర్పుప్రాంత ఆరి్థక వేదిక సమావేశాలకు హాజరైన హర్దీప్ సింగ్ ఢిల్లీకి తిరిగి వచ్చేముందు మాస్కోలో విలేకరులతో పలు అంశాలను ప్రస్తావించారు. వోస్తోక్ ఆయిల్, ఆర్కిటిక్ ఎల్ఎన్జీ–2లో పెట్టుబడి అవకాశాలపై చర్చించినట్లు తెలియజేశారు. ఈ వివరాలను తాజాగా వెల్లడించారు. వోస్తోక్, ఆర్కిటిక్ పెట్టుబడులు భారత్, రష్యాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసేందుకు దారిచూపనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఐపీఓకు ఇది సరైన సమయం కాదు
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్(ఓవీఎల్)ను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడానికి ఇది సరైన సమయం కాదని ఓవీఎల్ ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. మొజాంబిక్, ఇరాన్‌ల్లోని భారీ చమురు క్షేత్రాల్లో 2022 నుంచి ఉత్పత్తి చేయడం ఆరంభిస్తామని, అప్పుడైతే, మంచి విలువ వస్తుందని, స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌కు అదే సరైన సమయమని ఆయన వివరించారు. ఈ విషయాన్ని ఇంకా ప్రభుత్వానికి నివేదించలేదని, థర్డ్ పార్టీ ఎనాలసిస్ పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అన్ని విషయాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఓవీఎల్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని గత నెలలో ప్రభుత్వం ఓఎన్జీసీకి ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే. ఓవీఎల్‌ను లిస్ట్ చేయడం ద్వారా వచ్చిన నిధులను స్పెషల్ డివిడెండ్‌గా ప్రభుత్వానికి చెల్లించాలని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం నెరవేరుతుందని ఆ లేఖలో ప్రభుత్వం పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో హెచ్పీసీఎల్లో 51.11 శాతం వాటాను ఓఎన్జీసీ కొనుగోలు చేసింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని ప్రభుత్వం సునాయాసంగా సాధించగలిగింది. ఎయిర్ ఇండియా వాటా విక్రయం ద్వారా ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం యోచించింది. కానీ ఈ వాటా విక్రయం విఫలం కావడంతో మళ్లీ ఓఎన్జీసీ వైపు ప్రభుత్వం చూస్తోంది. -
వాంకోర్‌లో ఓవీఎల్ వాటా పెంపు!
► ఇప్పటికే 15 శాతం వాటా కొనుగోలు ► మరో రష్యా చమురు క్షేత్రం టాస్‌లో వాటాలపై ఐవోసీ, ఆయిల్ దృష్టి మాస్కో: రష్యాతో చమురు బంధాలను పటిష్టం చేసుకోవడంపై భారత కంపెనీలు దృష్టిపెడుతున్నాయి. రష్యాలో రెండో అతిపెద్ద చమురు క్షేత్రం వాంకోర్‌లో వాటాలు మరింత పెంచుకునేందుకు ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్) చర్చలు జరుపుతోంది. అటు, తూర్పు సైబీరియాలోని టాస్-యురియాఖ్ నెఫ్త్‌గాజొదొబైచా చమురు ప్రాజెక్టులో వాటాలు దక్కించుకునేందుకు ఇండియన్ ఆయిల్ (ఐవోసీ)-ఆయిల్ ఇండియా (ఆయిల్) కసరత్తు చేస్తున్నాయి. వాంకోర్‌లో తొలుత 25 శాతం వాటాలు కొనుగోలు చేయాలని ఓవీఎల్ భావించింది. అయితే, ఆ క్షేత్ర యాజమాన్య సంస్థ రాస్‌నెఫ్ట్ 1.26 బిలియన్ డాలర్లకు 15 శాతం వాటాలను అమ్మేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ డీల్‌కు సంబంధించిన ప్రక్రియలో తొలి దశ పూర్తి కావడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా ఓవీఎల్, రాస్‌నెఫ్ట్ అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అదే సమయంలో వాంకోర్‌లో ఓవీఎల్ వాటాలు పెంచుకునే అంశంపైనా చర్చలు జరిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వాంకోర్ క్షేత్రంలో 476 మిలియన్ టన్నుల చమురు, 173 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్ ఉందని అంచనా. ఇందులో నుంచిరోజుకు 60,000 టన్నుల ఉత్పత్తి నమోద వుతోంది. ఇక, టాస్-యురియాఖ్ ప్రాజెక్టులో వాటాల విక్రయ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రాస్నెఫ్ట్తో ఐవోసీ, ఆయిల్ విడిగా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. టాస్-యురియాఖ్‌లో ఐవోసీ-ఆయిల్ 29 శాతం వాటాలు కొనుగోలు చేయాలని యోచిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో సుమారు 20 శాతం వాటాలను రాస్‌నెఫ్ట్ అక్టోబర్‌లో బ్రిటన్ సంస్థ బీపీకి 750 మిలియన్ డాలర్లకు విక్రయించింది.