'పద్మ' చెంతకు దాసరి..
మొయినాబాద్: ప్రముఖ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు అంత్యక్రియలు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు మొయినాబాద్ మండలం తోల్కట్ట సమీపంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నారు. దాసరికి ఇక్కడ 18 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉంది. నాలుగేళ్ల క్రితం ఆయన భార్య దాసరి పద్మ అంత్యక్రియలను ఇక్కడే నిర్వహించారు.
ఆనాటి నుంచి ఫామ్‌హౌస్‌ను పద్మాగార్డెన్ అని పిలుస్తున్నారు. అంతేకాకుండా దాసరికి ఈ గార్డెన్తో చాలా అనుబంధం ఉందని తెలిసింది. అందుకే భార్య అంత్యక్రియలను ఇక్కడే నిర్వహించారు. దాసరి నారాయణరావును ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కలిసేవాడినని, ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడని తోల్కట్ట మాజీ సర్పంచ్, రైతు శంకర్ ముదిరాజ్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.