అవార్డుకు అర్హుడు శంకర్
సిద్దిపేట జోన్: ‘సాక్షి’ ప్రధాన కార్టూనిస్టు పామర్తి శంకర్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డు రావడం హర్షించదగ్గ విషయమని సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి మహేష్ పేర్కొన్నారు. ఆ అవార్డుకు ఆయన అర్హుడన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ చిత్రకారుల సమ్మేళనానికి తాను వెళ్లాననీ, ఈ కార్యక్రమానికి కార్టూనిస్ట్ శంకర్ హాజరుకాగా, తాను ఆటోగ్రాఫ్‌ను కోరనన్నారు. అయితే క్షణాల వ్యవధిలోనే తన నఖ చిత్రాన్ని శంకర్ ఆటోగ్రాఫ్ రూపంలో వేసిచ్చారన్నారు. వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ అవార్డు ఈ ఏడు ‘సాక్షి’ కార్టూనిస్టు శంకర్‌కు రావడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.