పంపాదిపేటలో ఉద్రిక్తత
తొండంగి: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కోన తీరప్రాంతంలో దివీస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పరిసర గ్రామాల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదివారం దివీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టిన పంపాదిపేట వాసులను అరెస్ట్ చేయడానికి ఇవాళ పోలీసులు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్తులకు మధ్య జరిగిన తోపులాటలో ఇద్దరికి గాయాలయ్యాయి.