నేడు పోలింగ్
సాక్షి, గుంటూరు: జిల్లాలో వాయిదా పడిన పంచాయతీలకు శనివారం పోలింగ్ జరగనుంది. నాలుగు పంచాయతీలు, 29 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ పోలింగ్ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. బ్యాలెట్ పేపర్లు అప్పగించారు. ఎన్నిక ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు.
ఇందుకు సంబంధించి మొత్తం పోలింగ్ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం ఆయా గ్రామాలకు చేరుకుంది. అసలు ఆరు పంచాయతీలు, 45 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే నామినేషన్ల ఘట్టం పూర్తయిన తర్వాత నాలుగు పంచాయతీల సర్పంచ్లు, 29 వార్డులకు మాత్రమే ఎన్నికలు ఖరారయ్యాయి. ముత్తాయపాలెం, రామచంద్రపురం పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు నేడు పోలింగ్ కాలేదు.
పెదకూరపాడు మండలంలోని ముస్సాపురం, ముప్పాళ్ళ మండలంలో కుందూరివారిపాలెం, పొన్నూరు మండలంలోని కసుకర్రు, మంగళగిరి మండలంలోని బేతపూడి గ్రామాల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నాలుగు సర్పంచ్ స్థానాలకు పది మంది, 29 వార్డులకు 38 మంది బరిలో ఉన్నారు.
ఎన్నికలు జరిగే నాలుగు పంచాయతీల్లో ఆయా మండలాల తహశీల్దార్లు గ్రామాల్లోనే ఉండాలని జిల్లా కలెక్టరు సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ 144 సెక్షన్ అమలు చేయాల్సి వస్తే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో తహశీల్దార్లు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.