కాసేపట్లో ఈసీని కలవనున్న సెల్వం వర్గం
న్యూఢిల్లీ: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:45 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ఈసీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. పార్టీ నియమావళి ప్రకారం శశికళ ఎన్నికపై అభ్యంతరాలున్నాయని సెల్వం వర్గీయులు వివరించనున్నారు.
అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావాలంటే ఐదేళ్లు పార్టీ సభ్యత్వం ఉండాలని, ఈ పదవికి శశికళ అనర్హురాలంటూ పన్నీరు సెల్వం వర్గీయులు ఇటీవల ఈసీకి లేఖ రాశారు. ఈసీ దీనిపై అన్నా డీఎంకేను వివరణ కోరింది. ఈ నేపథ్యంలో సెల్వం వర్గీయులు ఈసీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. జయలలిత మరణించాక ఆమె స్థానంలో అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారు. ఆ తర్వాత పన్నీరు సెల్వం స్థానంలో సీఎం కావాలని శశికళ ప్రయత్నించడంతో తమిళనాట ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి
పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు!
శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే..
‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం
లొంగిపోయిన చిన్నమ్మ
వీడని ఉత్కంఠ
ఇక అమ్మ ఫొటో కనిపించదా
పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ
ఆచితూచి అడుగులు
మద్దతు కాదు కృతజ్ఞతే!