6న బీసీల శంఖారావం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి వెనుకబడిన తరగతుల ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను కల్పిం చాలని వివిధ బీసీ సంఘాలు, ఉద్యోగ బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. దీని కోసం సమరానికి సిద్ధం కావాలని సంఘాలు పిలుపునిచ్చాయి. భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు ఈ నెల 6న (శనివారం) హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బీసీ ఉద్యోగుల శంఖారావం నిర్వహించనున్నాయి.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, వెంకన్నగౌడ్ (తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సం ఘం), గుజ్జకృష్ణ (బీసీ సంక్షేమసంఘం), కె.నర్సింహగౌడ్ (తెలంగాణ బీసీ సంక్షేమసంఘం), శారద (బీసీ మహిళ సంఘం), విక్రమ్‌గౌడ్ (బీసీ విద్యార్థిసంఘం) శంఖారావం పోస్టర్‌ను విడుదల చేశారు.