parvatamma
-
భర్తను ముక్కలు ముక్కలుగా చేసి..
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కట్టుకున్న భార్యే నిందితురాలిగా తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 45 రోజుల క్రితం జిల్లాలోని కల్వకుర్తి పట్టణం హనుమాన్ నగర్ కాలనీకి చెందిన తన భర్త కావలి మల్లయ్య కనిపించడం లేదంటూ పార్వతమ్మ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. భార్య పార్వతమ్యే తన భర్తను చంపినట్టు బయటపడింది. పార్వతమ్మకి రాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తన సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన ఇరువురు.. మల్లయ్యను హతమార్చాలనుకున్నారు. ఈ క్రమంలోనే ప్రియుడు రాములు, కొడుకు శ్రీకాంత్‌లతో కలిసి భర్తను హత్యచేసింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బస్తాలో కట్టేసే జిల్లాలోని నాగనూల్ చెరువులో పడేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ పార్వతమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో తమదైన శైలిలో దర్యాప్తు చేసిన పోలీసులు పార్వతమ్మే హత్య చేసినట్టు నిర్ధారించారు. దీంతో పార్వతమ్మ, ప్రియుడు రాములు, కొడుకు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య
పుంగనూరు: భర్త మద్యానికి బానిసవడంతో మనస్తాపానికి గురైన మహిళ కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న పార్వతమ్మ(26) భర్త చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మేస్తుండటంతో.. మనస్తాపానికి గురై మూడేళ్ల కొడుకు పవన్‌కుమార్‌తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పవన్ కుమార్ మృతదేహం లభించగా, పార్వతమ్మ మృతదేహం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
కలెక్టరేట్లో మహిళ ఆత్మహత్యాయత్నం
-
కలెక్టరేట్లో మహిళ ఆత్మహత్యాయత్నం
ఏలూరు: తనకు కేటాయించిన ఇందిరమ్మ నివేశన స్థలాన్ని కొందరు నేతలు ఆక్రమించారని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేదని ఒక మహిళ సోమవారం ఉదయం ఏలూరు కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలోని చిట్టెమ్మ దిబ్బ ప్రాంతానికి చెందిన పార్వతమ్మకు దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ నివేశన స్థలాన్ని మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ స్థలాన్ని టీడీపీ నేతలు ఆక్రమించారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేదు. దాంతో విసిగిపోయిన ఆమె ఈరోజు ఉదయం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్‌కు వచ్చింది. అక్కడ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. సదరు మహిళతో అధికారులు మాట్లాడేందుకు చర్యలు తీసుకున్నారు.