ప్రశాంతంగా బార్ అసోసియేషన్ ఎన్నికలు
సాక్షి, బళ్లారి : బళ్లారి బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి బార్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం బళ్లారి బార్ అసోసియేషన్ ఎన్నికలు జిల్లా కోర్టు ఆవరణంలో నిర్వహించారు. బళ్లారిలో బార్ అసోసియేషన్ సభ్యులు 910 మంది ఉండగా, ఇందులో 783 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బళ్లారి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పాటిల్ సిద్ధారెడ్డి, వై.రంగనాథ్ పోటీలో ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టు ఆవరణంలో ఎన్నికల సందడి నెలకొంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల గడువు ముగియడంతో ఈ ఎన్నికలు నిర్వహించారు. దాదాపు 84 శాతం ఓటింగ్లో పాల్గొన్నారని, శనివారం ఓట్ల లెక్కింపు జరగనుందని ఎన్నికల అధికారి శ్యామ్సుందర్ తెలిపారు.