phenyl
-
దారుణం.. ఇంటి యజమానిని చితకబాది.. నోట్లో పినాయిల్ పోసి..
ముంబై: మహారాష్ట్ర ముంబైలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న నలుగురు వ్యక్తులు యజమానిని చితకబాదారు. ఆపై అతని నోట్లో పినాయిల్ పోశారు. దీంతో అతని పేగులు కాలి తీవ్ర కడపునొప్పితో ఇబ్బందిపడ్డాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెప్పారు. ముంబై శివాజినగర్‌లో మంగళవారం రాత్రి 7:30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే యజమానికి అతని ఇంట్లో అద్దెకుండే వాళ్లు డబ్బులిచ్చారు. చాలా రోజులైనా తిరిగి ఇవ్వకపోవడంతో వాళ్లు అతనితో తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో మంగళవారం మాటామాటా పెరిగింది. అద్దెకు ఉండే నలుగురు కలిసి అతన్ని గోడకు నెట్టేశారు. అనంతరం ఒకరు యజమాని నోట్లో బలవంతంగా పినాయిల్ పోశారు. ఈ ఘటనలో నలుగురు నిందితులపై హత్యాహత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు సియాన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. చదవండి: తల్లి హీరాబెన్ పాడె మోసిన ప్రధాని మోదీ -
‘గవర్నర్ ఆ చేతిని ఫినాయిల్‌తో కడగాల్సింది’
సాక్షి, హైదరాబాద్ : తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ మహిళా జర్నలిస్టు చెంపను తడమటాన్ని సమర్ధిస్తూ సోషల్‌మీడియాలో పోస్టు చేసిన తమిళనాడు బీజేపీ నాయకుడు శేఖర్ వెంకటరామన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. జర్నలిస్టును తాకిన చేయిని బన్వరీలాల్ ఫినాయిలతో కడుక్కోవాలని సూచించారు. వెంకటరామన్ పోస్టుపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో నష్ట నివారణా చర్యల్లో భాగంగా ఆయన దాన్ని తొలగించారు. గవర్నర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీల పరువుకు భంగం కలిగించేందుకే జర్నలిస్టు గవర్నర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారని వెంకటరామన్ పోస్టులో రాసుకొచ్చారు. తమిళనాడులోని మహిళా జర్నలిస్టులు బడా వ్యక్తులతో గడపకుండా రిపోర్టులు కాలేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పోలీసు స్టేషన్లలో వస్తున్న ఫిర్యాదులను గమనిస్తే ఇదే ప్రస్ఫుటమవుతుందని వ్యాఖ్యానించారు. సెక్స్ ఫర్ డిగ్రీ స్కామ్‌లో పురోహిత్ పేరు బయటకు రావడంపై లక్ష్మీ సుబ్రహ్మణ్యం గవర్నర్‌ను ప్రశ్నించారు. అందుకు సమాధానం ఇవ్వని గవర్నర్ ఆమె చెంపను తడిమారు. దీనిపై మాట్లాడిన వెంకటరామన్ విశ్వవిద్యాలయాల్లో కన్నా మీడియా సంస్థల్లో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అనుచితంగా ప్రవర్తించి, చెంపను తాకినందుకు మహిళా జర్నలిస్టు లక్ష్మీ సుబ్రహ్మణ్యంకు గవర్నర్ క్షమాపణ తెలిపిన విషయం తెలిసిందే. -
జూనియర్ పై సీనియర్ల అకృత్యం
కోజికోడ్: ర్యాగింగ్ బారిన పడిన కేరళ నర్సింగ్ విద్యార్థిని ఒకరు చావుబతుకుల్లో ఉంది. సీనియర్స్ కిరాతకం కోజికోడ్ కు చెందిన 19 ఏళ్ల దళిత యువతి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. గత 9నకర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుల్బర్గాలోని అల్ ఖమర్ నర్సింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న కేరళ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు. ఆమెతో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి వాడే ఫినాయిల్ బలవంతంగా తాగించారు. బాధితురాలిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఆమె కోలుకోలేదు. దీంతో ఆమెను కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ఫినాయిల్ తాగడం వల్ల అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. కూలి పనులు చేసుకుని జీవించే తాను కూతురు చదువు కోసం రూ. 3 లక్షలు అప్పు చేశానని బాధితురాలి తల్లి వెల్లడించింది. ర్యాగింగ్ జరగలేదని, కుటుంబ సమస్యల కారణంగానే బాధితురాలు ఫినాయిల్ తాగిందని నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్తేర్ పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై గుల్బర్గా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.