రెండో పిజ్జా రెడీ
విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా రంజిత్ జయకోడి దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా ‘పురియాద పుదిర్’. డీవీ సినీ క్రియేషన్స్ పతాకంపై ‘పిజ్జా–2’గా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను అందిస్తున్నారు నిర్మాత డి. వెంకటేశ్. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
డి. వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో తెలిపే కథతో థ్రిల్లర్ జానర్లో రూపొందిందీ సినిమా. రంజిత్ జయకోడి సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని ఉత్కంఠగా సాగే కథనంతో సినిమాను నడిపించారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్ సీయస్.