కథా ఉత్సవం - 2014
నవంబర్ 30, ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 6 గం. వరకూ సామాన్య కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కథా ఉత్సవం -2014 కార్యక్రమాలు. తొలిగా కె.శివారెడ్డి అధ్యక్షతన ‘ప్రాతినిధ్య - 2013’ ఆవిష్కరణ. ఆవిష్కర్త: సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి. శరత్ జ్యోత్స్నారాణి, ఆర్టిస్ట్ మోహన్, వాడ్రేవు చినవీరభద్రుడు, కనీజ్ ఫాతిమా తదితరులు పాల్గొంటారు. అనంతరం ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ చేతుల మీదుగా సాహితీ పురస్కారాల ప్రదానం. కొలకలూరి ఇనాక్ చేతనా పురస్కారాన్ని మధురాంతకం నరేంద్ర, షేక్ హుసేన్ (సత్యాగ్ని) చేతనా పురస్కారాన్ని బా రహమతుల్లా, బోయ జంగయ్య చేతనా పురస్కారాన్ని జూపాక సుభద్ర, పి.సత్యవతి చేతనా పురస్కారాన్ని వాడ్రేవు వీరలక్ష్మీదేవి, కేతు విశ్వనాథరెడ్డి చేతనా పురస్కారాన్ని డా.వి.చంద్రశేఖరరావు అందుకుంటారు.
అనంతరం ప్రాతినిధ్య - 2013లో ఉన్న రచయితల కథా నేపథ్యం, ఆ తర్వాత ఇటీవల రాస్తున్న కొత్త రచయితలతో ముఖాముఖి ఉంటుంది. శిఖామణి, తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్, అక్కిరాజు భట్టిప్రోలు, టైటానిక్ సురేశ్, వేంపల్లె షరీఫ్, అరిపిరాల సత్యప్రసాద్ తదితరులు కార్యక్రమాలను సమన్వ యం చేస్తారు. నందలూరు రాజేంద్ర ప్రసాద్, సాకం నాగరాజ, కోట పురుషోత్తంలకు సత్కారం ఉంటుంది.