తూ.గో. జిల్లాలో లాకప్‌డెత్.. స్టేషన్‌పై దాడితో ఉద్రిక్తత
తాళ్లరేవు, న్యూస్‌లైన్: తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి లాకప్ డెత్ జరిగింది. పి.మల్లవరం గ్రామంలో కొందరు పేకాడుతుండగా బుధవారం సాయంత్రం దాడిచేసిన కోరంగి పోలీసులు 9మందిని అరెస్టుచేసి స్టేషన్‌కు తీసుకువచ్చారు. వారిలో ధూళిపూడి కృష్ణ రాత్రి 8 గంటల సమయంలో పోలీసుల దెబ్బలకు తాళలేక చనిపోయాడు. విషయం తెలిసిన మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ఎస్ఐ ఎం.సాగర్‌బాబును అరెస్టుచేయాలని రాస్తారోకో నిర్వహించారు.
కొంతమంది ఆగ్రహంతో పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రకాష్‌యాదవ్, అడ్మినిస్ట్రేషన్ అడిషనల్ ఎస్పీ కె.సత్యనారాయణ, కాకినాడ రూరల్ సీఐ శరత్‌రాజ్‌కుమార్ కోరంగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఆందోళనకారులు ఎస్ఐని అరెస్టు చేయాల్సిందే ఆందోళన కొనసాగిస్తున్నారు.