గోవధపై జాతీయ భద్రత చట్టం
లక్నో: గోవధ, పశువుల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై జాతీయ భద్రత చట్టం(ఎన్ఎస్ఏ), గ్యాంగ్స్టర్స్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ సుల్కన్ సింగ్ అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు.
గోరక్షక్ పేరుతో దాడులకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలను ఆదేశించారు. కేంద్రం తెచ్చిన పశువధ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం.