30కి చేరిన పుష్కరాల మృతుల సంఖ్య
రాజానగరం: గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రిలోని పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 30కి చేరుకుంది. తొక్కిసలాటలో అక్కడిక్కడే 27 మంది మృతి చెందగా, అనంతరం చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించిన సంగతి విదితమే.
విజయనగరం జిల్లా బాడంగి మండలం, పాల్టేరుకు చెందిన పూడి పారమ్మ(80) తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో స్థానిక జీఎస్ఎల్ జనరల్ ఆస్పత్రిలో చేరింది. ఆమెను గత కొన్ని రోజులుగా వెంటిలేషన్‌పై ఉంచి చికిత్స చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది.