మహిళపైకి దూసుకుపోయిన ట్యాంకర్
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని తిప్పలూరు గ్రామ సమీపాన శ్రీ సాయిబాబ దేవాలయం వద్ద ఫ్లైయాష్ ట్యాంకర్ మహిళపై దూసుకుపోయింది. ప్రమాదంలో ట్యాంకర్ కింద పడి ప్రభావతమ్మ అనే మహిళ దుర్మరణం చెందింది. వివరాలిలా.. కమలాపురం మండలం పందిర్లపల్లె గ్రామానికి చెందిన ప్రభావతమ్మ(55 తిప్పలూరు గ్రామ సమీపంలో ఉండే సాయిబాబా దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం రోడ్డు దాడుతుండగా ట్యాంకర్ ఢీకొంది. ప్రమాదంలో ప్రభావతమ్మ టైర్లకింద పడి నుజ్జునుజ్జు అయింది. డ్రైవర్ పరారు పరారయ్యాడు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ వెంకటనాయుడు పరిశీలించారు. మృతురాలు బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.