పరిశోధన ఫలాలు ప్రజలకు అందాలి
పటాన్చెరు: పరిశోధన ఫలాలు ప్రజలకు అందాలని ఓయూ కెమిస్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సోమేశ్వర్ పోలా అన్నారు. రుద్రారం హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో మంగళవారం ‘సీహెచ్-బాండ్ క్రియాశీలత ద్వారా కొత్త సేంద్రియ పదార్థాల సంశ్లేషణ, సేంద్రి ఎలక్ట్రానిక్స్ రంగంలో వాటి అనువర్తనాలు’ అనే అంశంపై ఆయన ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా పరిశోధన ఫలాలు పేదల దరిచేరాలని, సమాజానికి ఉపయోగపడితేనే ఆ శోధన సాఫల్యవంతమవుతుందన్నారు.
పరిశోధనలు పత్ర సమర్పణకో, పట్టాలు పొందేందుకో కాకుండా వాటి ఫలాలు ప్రజలకు ఉపయోగపడినప్పుడే ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రజోపయోగ పరిశోధనలు సాగించాలని విజ్ఙప్తి చేశారు. సేంద్రియ పదార్థాల సంశ్లేషణ, వాటి అనువర్తనాల గరించి ఆయన వివరించారు. కార్యక్రమంలో బాబా ఆటామిక్ రిసెర్చ్ సెంటర్ పూర్వ శాస్త్రవేత్త డా.జి.ఏ.రామారావు, ప్రొఫెసర్లు రాంబాబు గుండ్ల, ఐబీ సుబ్బారెడ్డి, అసోసియేట్ ప్రొ డా.పాత్రుడు, డా.శివకుమార్, డా. నాగేంద్రకుమార్ తదితరులు పాలొ్గన్నారు.