నేనే నంబర్-1
9999 ఫ్యాన్సీ నంబర్‌కు రూ.2.70 లక్షలు
ఇష్టమైన వాహనాలు కొనుగోలు చేసేందుకు లక్షలు, కోట్లు వెచ్చిస్తుంటారు. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో తమ అదృష్ట సంఖ్య రాకపోతే నిరుత్సాహపడుతుంటారు. అందుకే చాలామంది ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ పడుతుంటారు. ఎంత డబ్బులైనా వెచ్చించి సొంతం చేసుకునేందుకు తహతహలాడుతుంటారు. అచ్చం అలాంటిదే మంగళవారం తిరుపతి ఆర్టీవో కార్యాలయంలో చోటుచేసుకుంది.
తిరుపతి ఆర్టీవో వివేకానందరెడ్డి సమక్షంలో ఏపీ03-బివి 9999 ఫ్యాన్సీ నంబర్‌కు నిర్వహించిన వేలం పాటలో పలువురు పోటీ పడ్డారు. ఈ నంబర్‌ను పుత్తూరుకు చెందిన ఓ విద్యాసంస్థ యాజమాన్యం రూ.2,69,999 వెచ్చించి సొంతం చేసుకుంది. జిల్లాలో ఫ్యాన్సీ నంబర్ కోసం ఇంత పెద్దమొత్తం వెచ్చించడం ఇదే మొదటిసారని తెలిసింది.
- తిరుపతి, మంగళం