రాఖీ కట్టించుకుందామని పక్క ఊరెళ్లే సరికి..
నిజామాబాద్: రాఖీ కట్టించుకుందామని యజమాని తన కుటుంబసభ్యులతో కలిసి పక్క ఊరిలో ఉన్న బంధువుల దగ్గరికెళ్లి ఇంటికి వచ్చేసరికి దొంగలు ఇల్లు గుల్ల చేశారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి పోలీస్స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి చోరీ చోటుచేసుకుంది.
సంతోష్ కుమార్ రాఖీ పండగ కోసం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఆదివారం మధ్యాహ్నం వచ్చాడు. ఇంట్లోకి వచ్చి చూసేసరికి.. కిటికీలు తొలగించి ఇంట్లో ఉన్న 3.7 తులాల బంగారం, రూ.6000 నగదును దుండగులు దోచుకెళ్లారని గమనించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.