రహస్య వివాహం చేసుకున్న హీరోయిన్!
సాక్షి, న్యూఢిల్లీ: సినిమా హీరోయిన్లు ఎప్పుడు తమను తాము ప్రచారం చేసుకోవడానికి ట్విట్టర్లు, ఫేస్‌బుక్‌లు దాటి ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుకుంటున్నారు. తమ గ్లామర్ ఫోటోలను అందులో పోస్ట్ చేసి అభిమానులను ఆకట్టుకుంటారు. నటి రియాసేన్ గుర్తుందా? ఈ బాలీవుడ్ బ్యూటీ తన ఫొటోల ద్వారా ప్రైవేట్ విమానయాన సంస్థ అధినేత శివం తివారిని ఆకర్శించింది. రియాసేన్ ఫొటోలు చూసి ఆమెకు వీరాభిమాని అయిపోయాడు. అంతేకాదు ఆమెకు ఫోన్ చేసి పరిచయం పెంచుకున్నాడు. మామూలుగా మొదలయిన వీరి పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకూ చేరింది. వీరి పెళ్లి ఈ నెల చివరి వారంలో జరగనుందని వార్తలు వచ్చాయి. అయితే బాలీవుడ్ సమాచారం ప్రకారం రియాసేన్, శివం తివారీ పెళ్లి ఎప్పుడో జరిగిపోయిందట.
సన్నిహితులు, బంధువుల సమక్షంలో వాళ్లిద్దరూ పూణేలో పెళ్లి చేసుకున్నారంటూ రియా సోదరి రైమా సేన్ సోషల్‌మీడియాలో ఫొటోలను షేర్ చేసింది. ఇందులో రియా సేన్, శివం తివారీలు సంప్రదాయ బెంగాళీ పెళ్లి దుస్తుల్లో చూడముచ్చటగా ఉన్నారు. ఈ పెళ్లికి పరిమిత సంఖ్యలో స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రియాసేన్ ఏక్తాకపూర్ వెబ్ సిరీస్ రాగిణి ఎమ్ఎమ్ఎస్2.2లో నటించింది. ఇది రియాసేన్ అభిమానులను చేదు వార్తే.