సంతానం కోసం వచ్చా : సినీనటి అనిత
శ్రీకాళహస్తిః సంతానం కోసం శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహుకేతు పూజలు చేయించుకుంటే తప్పకుండా సంతానం లభిస్తోందని మా మిత్రులు చెప్పారు.దాంతో కుటుంబసభ్యులతో కలసి విచ్చేసినట్లు సినీనటి అనిత అన్నారు.సోమవారం ఆమె కుటుంబసభ్యులతో కలసి రాహుకేతు పూజలు చేయించుకున్నారు.అనంతరం స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు.
అనంతరం ఆలయ ఆవరణంలోని పొగడ చెట్టు వద్ద సంతానం కోసం ప్రదక్షణలు చేశారు.సంతానంతో పాటు మనలో ఒకడు అనే చిత్రంలో తాను నటించానని...ఆ చిత్రం విజయవంతం కావాలని శివపార్వతులను కోరుకున్నట్లు చెప్పారు.ఆలయ శిల్పసౌందర్యం అద్భుతంగా ఉందని కొనియాడారు.వారితోపాటు ఆలయు ధర్మకర్తల మండలి సభ్యులు లోకనాధంనాయిడు,నారాయణయాదవ్ ఉన్నారు.