ప్రతి సబ్‌స్టేషన్ వద్ద ఇంకుడుగుంత
తిరుపతి రూరల్: సదరన్ డిస్కం పరిధిలో ఉన్న 2,200 సబ్ స్టేషన్లలో ఇంకుడు గంతలను నిర్మించనున్నట్టు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర తెలిపారు. బుధవారం తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంకుడుగుంతను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇకపై కొత్తగా ఏర్పాటు చేయబోయే విద్యుత్ సబ్‌స్టేషన్లలోనూ ఇంకుడు గుంతలను నిర్మించాలని ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు.