క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించాలి: రాజారామ్ సింగ్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: క్రీడల్లో ఇంటర్ విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని హైదరాబాద్ జిల్లా జూనియర్ కాలేజి గేమ్స్ సమాఖ్య అధ్యక్షుడు డీవీఈఓ రాజారామ్ సింగ్ పేర్కొన్నారు.
శుక్రవారం విజయనగర్ కాలనీలోని విజయనగర్ జూని యర్ కాలేజి విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించగలరని ఆయన తెలిపారు. ప్రతి కాలేజి తప్పనిసరిగా వార్షిక క్రీడోత్సవాలను నిర్వహించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలేజి సొసైటీ కార్యదర్శి బి.వేణుగోపాల్‌రెడ్డి, కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ మాలతీ, ఫిజికల్ డెరైక్టర్ ఎం.వి.రామారావు తదితరులు పాల్గొన్నారు.