పులి దెబ్బ...
అచ్చంపేట, న్యూస్‌లైన్: శ్రీశైలం-నాగార్జునసాగర్ రాజీవ్ టైగర్ రిజర్వు ఫారెస్టులో పెద్దపులుల మనుగడ ప్రశ్నార్ధకంగా మా రిందని పలువు రు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అమ్రాబాద్ మండలం నల్లమల ప్రాంతంలోని చెంచుకుర్వ వద్ద ఓ పెద్దపు లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం వెలుగులోకి రావడంతో అటవీ అధికారులు గురువారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. పులుల గణన ప్రారంభమైన ఈ తరుణంలోనే పెద్దపులి మృత్యువాత పడడం అటవీ సిబ్బందిని అదరగొట్టింది. అటవీ అధికారులు ఫీల్డ్ డెరైక్టర్ రా హుల్పాండే, డీఎఫ్ఓ వెంకటరమణ, సం ఘటన ప్రాంతాన్ని సందర్శించి మృతికి కారణాలు , అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.
అది గత నాలుగు రోజుల కింద ట మృతి చెంది ఉండవచ్చునని దాని తల భాగం, ముందు కాళ్లు కుళ్లి పోయాయని దాని వయస్సు సుమారు 8ఏళ్లుంటుందని అంచనావేస్తున్నారు. పులి వెనుక భాగంలోని రెండు కాళ్ళు మినహాయిస్తే శరీర భాగాల్లో ఎక్కడా గాయాలు లేవు. అది వి షయప్రయోగం వల్లగానీ, అనారోగ్యంతో కానీ మృతిచెంది ఉండవచ్చని భా విస్తున్నారు. మృతి చెందిన తర్వాత ఆ దా రి గుండా వెళ్లిన వారు గోళ్ల కోసం కాళ్ళను నరికి ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించాక విషయం తెలుస్తుందని అన్నారు. సంఘటన వద్దకు వెళ్లిన వారిలో ఏసీఎఫ్ కిష్టగౌడ్, ఎఫ్ఆర్వో లక్ష్మణ్, సిబ్బంది ఉన్నారు.
పోస్టుమార్టం నివేదిక
అందాకే స్పష్టత...
పులి కళేబరానికి ఫారెస్టు శాఖ(ఢిల్లీ)కి చెం దిన ఇమ్రాన్ ,హెద్రాబాద్ జూపార్క్ డా క్టర్ శ్రీనివాస్, స్థానిక వైధ్యాధికారులు పెద్దపులికి శవపరీక్ష జరిపారు. శాంపిల్స్‌ను సీసీఎంఈ, జూపార్క్, బీబీఆర్ఐకి చెందిన మూడు ల్యాబ్‌లకు పంపారు. నివేదిక వచ్చాకన దాని మృతిపై స్పష్టత వ స్తుందని అటవీశాఖ ఫీల్డ్ డెరైక్టర్ రాహుల్‌పాండే విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
బాధ్యులపై వేటు
రిజర్వు ఫారెస్టులో పెద్దపులి మృతిచెంది నాలుగురోజులైనా సమాచారం తెలుసుకోడంలో విఫలమైన సిబ్బందిపై వేటు పడింది. ఇందుకు సంబంధించిన బీఎఫ్ఓ, ముగ్గురు ట్రాకర్స్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎఫ్డీ తెలిపారు. సమావేశంలో డీఎఫ్ఓ వెంకటరమణ తదితరులు ఉన్నారు.